Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా క్రీడా జీవితం ముగిసింది... రేపటి నుంచి గన్ పట్టను: అభినవ్ బింద్రా

భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా క్రీడా జీవితం ముగియనుంది. ఆసియా క్రీడల తరువాత షూటింగ్ కు గుడ్ బై చెబుతానని ప్రకటించిన బింద్రా, మరో 24 గంటల క్రీడా జీవితం మిగిలి ఉందని చెప్పాడు. రేపటితో తన క్రీడా జీవితం ముగియనుందని, ఆసియా క్రీడల తరువాత ప్రొఫెషనల్ షూటింగ్ నుంచి తప్పుకుంటున్నానని బింద్రా ట్వీట్ చేశాడు. బీజింగ్ ఒలింపిక్స్ లో భారత్ కు పతకం అందించిన బింద్రా, 2010లో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్యపతకం సాధించాడు. ఇప్పుడు స్వర్ణం సాధించిన తన క్రీడా జీవితానికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తున్నాడు.

More Telugu News